: తెలంగాణ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది: నిమ్స్ వైద్యులు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు స్వల్పంగా బీపీ పెరిగి, నిన్న అస్వస్థతకు గురవడంతో ఆయన్ని నిమ్స్ కు తరలించారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు చెందిని వైద్యులు శేషగిరిరావు, గంగాధర్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య సేవలందిస్తున్నారు.