: ప్రత్యూష నాపై ఆరోపణలు చేయలేదు ... ముందస్తు బెయిలివ్వండి: హైకోర్టుకు వెళ్లిన రాహుల్ రాజ్ సింగ్
హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఏప్రిల్ 1న తన నివాసంలో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి, రాహుల్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో అతని అరెస్టు ఖాయమన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 7న సెషన్స్ కోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్లాడు. దానిని తిరస్కరించిన నేపథ్యంలో బాంబే హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించాడు. కాగా, ప్రత్యూష తనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కనీసం సూసైడ్ నోట్ కూడా ఆమె రాయలేదని ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ రాజ్ సింగ్ తెలిపాడు.