: కాసేపట్లో సూర్య '24' ఆడియో విడుదల


ప్రముఖ నటుడు సూర్య త్రిపాత్రాభినయంతో రూపొందిన '24' సినిమా ఆడియో వేడుక కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా, సైంటిఫిక్ ధ్రిల్లర్ గా రూపొందింది. టైమ్ మెషీన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుక తమిళనాడులో నేటి ఉదయం జరిగింది. కాసేపట్లో శిల్పకళావేదికపై జరగనుంది. ఈ కార్యక్రమంలో నటుడు సూర్యతో పాటు, సమంత, నిత్యామీనన్ పాల్గొంటారు. ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఈ సినిమాకు 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News