: వాళ్లు చెబుతూనే ఉన్నారు... మనం వింటూనే ఉన్నాం: పవన్ కల్యాణ్


విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను ఇప్పటి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎదురు చూస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వారు చెబుతూనే ఉన్నారు...మనం వింటూనే ఉన్నామని అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని ఆయన చెప్పారు. ఓటు బ్యాంకు, అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్లంటే తనకు పడదని ఆయన చెప్పారు. దేశ ఐక్యత, సమాజ శ్రేయస్సు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తనకు ముఖ్యమని పవన్ కల్యాణ్ తెలిపారు. అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News