: కొల్లం విషాదాన్ని ఆమె ఊహించింది... కలెక్టర్ ను కూడా కలిసింది... ప్రయోజనం శూన్యం!


దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కొల్లం పుట్టింగల్ దేవాలయం ఘటనను ముందుగా ఒక మహిళ ఊహించింది. ఈ విషాదాన్ని ఆపేందుకు ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆఖరుకి ఆమె కలెక్టర్ ను కలిసినా ఈ ప్రమాదాన్ని నివారించలేకపోయింది. పుట్టింగల్ దేవాలయం పక్కనే పంకజాక్షి ఇల్లు ఉంది. ఈ దేవాలయంలో ఉత్సవాలు జరిగిన ప్రతిసారీ ఆమె ఆవేదనకు గురయ్యేది. ఉత్సవాల్లో భాగంగా ఏటికేడు బాణసంచా కాల్పులు పెరిగిపోయాయి. వాటి ధాటికి ఆమె ఇంటి పైకప్పు పెచ్చులు ఊడేవి. ఆమె నివాసంలోని సామాన్లు చెల్లాచెదురుగా కిందపడిపోయేవి. దీంతో పుట్టింగల్ ఉత్సవ కమిటీకి పలు సందర్భాల్లో బాణసంచాను నియంత్రించాలని సూచించింది. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో కలెక్టర్ ను కలిస్తే ఉపయోగం ఉంటుందని భావించి, పలు మార్లు ఆమె కలెక్టర్ ను కలిసింది. వివిధ సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చింది. తాజాగా ఉత్సవాలు ప్రారంభానికి ముందు కూడా ఆమె కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చింది. అవన్నీ బుట్టదాఖలు కావడంతో ఆమె నిస్సహాయంగా ఉండిపోయింది. దీంతో, జరిగిన అగ్ని ప్రమాదంలో 112 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికైనా మేల్కొని దేవాలయాల్లో బాణసంచా కాల్పులు నిషేధించాలని ఆమె కోరుతోంది.

  • Loading...

More Telugu News