: అమెరికాలో డాగ్ 'కెఫే'... అక్కడ శునకాలతో ఆడుకోవచ్చు!


కాఫీ కెఫేల గురించి అందరికీ తెలిసిందే. కానీ, డాగ్ కెఫే కూడా ఒకటి ఉంటుందని చెప్పడానికి అమెరికాలో ని లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఈ శునకాల కెఫేయే నిదర్శనం. దేశంలో కుక్కల్ని పెంచుకోవడంపై ప్రజలను చైతన్య పరిచేందుకే ఈ కెఫేను ఏర్పాటు చేసినట్లు సారా వుల్ఫ్ గ్యాంగ్ అనే మహిళ పేర్కొంది. వీధి కుక్కలకు ఆశ్రయమిస్తున్న ఈ కెఫే ప్రత్యేకతల గురించి చెప్పాలంటే... కాఫీ, టీ తాగుతూ అక్కడి కుక్కలతో ఆడుకోవచ్చు, నచ్చిన కుక్కపిల్లలను దత్తత కూడా తీసుకోవచ్చు. విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డాగ్ కెఫే కు పెంపుడు కుక్కలతో వెళ్లేందుకు అనుమతి మాత్రం లేదు. కాగా, నిరాశ్రయంగా ఉన్న కుక్కలను వెదికి తెచ్చేందుకు సారా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం కొరియా, సియోల్ ప్రాంతాలకు చెందిన డాగ్ రెస్క్యూ బృందాలతో కలిసి పనిచేస్తుంది.

  • Loading...

More Telugu News