: టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ
వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జ్యోతుల నెహ్రూ కు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. నెహ్రూతో పాటు 32 మంది సర్పంచ్ లు, 43 మంది ఎంపీటీసీలు, ముగ్గురు జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ వర్గీయులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.