: కోహ్లీతో గొడవ పడ్డా...ఇప్పుడతని కెప్టెన్సీలోనే ఆడాల్సి వస్తోంది: షేన్ వాట్సన్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో మైదానంలో చాలా సార్లు గొడవపడ్డానని ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తెలిపాడు. బెంగళూరులో వాట్సన్ మాట్లాడుతూ, అన్నిసార్లు గొడవపడ్డప్పటికీ ఇప్పుడు అతని కెప్టెన్సీలో ఆడాల్సి వస్తోందని అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో గొప్పదనం అదేనని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీతో కలిసి ఆడుతానని అస్సలు ఊహించలేదని షేన్ వాట్సన్ చెప్పాడు. ఊహించనివే జీవితంలో జరుగుతుంటాయని వాట్సన్ తెలిపాడు. అయితే క్రికెటర్ గా కోహ్లీని గౌరవిస్తానని చెప్పాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన వాట్సన్ ను 9.5 కోట్ల రూపాయలు చెల్లించి బెంగళూరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News