: టీటీడీ ఉద్యోగి హత్య కేసులో భార్య, ఇద్దరు కుమార్తెలే నిందితులు!
టీటీడీ ఉద్యోగి మనోహర్ హత్య కేసును తిరుపతి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులు మనోహర్ భార్య, ఇద్దరు కుమార్తెలు అని పోలీసులు తెలిపారు. వాలంటరీ రిటైర్మెంట్ డిమాండ్ చేస్తూ మనోహర్ పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనను రుబ్బురోలు, సుత్తితో కొట్టి హతమార్చారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో వినియోగించిన రుబ్బురోలు, సుత్తిని స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.