: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్


ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన అక్కాచెల్లెళ్లతో కలిసి గడిపిన మధురమైన క్షణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమెరికాలో ప్రతి ఏటా ఏప్రిల్ 10వ తేదీన ‘సిబ్లింగ్ డే’ నిర్వహిస్తుంటారు. 1980లో తన సోదరీమణులతో కలిసి దిగిన ఒక ఫొటోను సామాజిక మాధ్యమంలో జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. ఒంటె ఆకారంలో ఉన్న ఒక చెక్క దిమ్మెపై జుకర్ బర్గ్ తన ముగ్గురు సోదరీమణులతో కలిసి కూర్చుని ఉన్నారు. ఈ ఫొటోతో పాటు తన సోదరీమణులు అరెల్లె, డొన్నా, రాండీ జుకర్ బర్గ్ లకు సిబ్లింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News