: జుట్టు ఎలా ఆరబెట్టుకోవాలో చెప్పిన వెనిజులా అధ్యక్షుడు... మండిపడుతున్న మహిళా లోకం


ఓ సలహా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు కానీ...ఓ సలహాతో విమర్శలు వెల్లువలా వస్తాయని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు తెలిసి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...ప్రపంచంలోని చాలా దేశాల్లోలా వెనిజులాను విద్యుత్ కొరత పట్టిపీడిస్తోంది. దీంతో విద్యుత్ పొదుపుగా వినియోగించుకోవాలని చెప్పిన మదురో...మహిళలు జుట్టు ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రయ్యర్లను వాడే కంటే ముని వేళ్లను జుట్టులోనికి పోనిచ్చి, సుతారంగా ఆరబెట్టుకుంటే చూడడానికి ఎంతో బాగుంటుందని సలహా ఇచ్చి తన రసజ్ఞత చాటుకున్నాడు. అంతే... ఆయన సలహాపై మహిళలు మండిపడుతున్నారు. దశాబ్ద కాలంగా విద్యుత్ కొరత ఉందని తెలిసిన అధ్యక్షుడు దానిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోగా, డ్రయ్యర్లు వాడొద్దని సలహా ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. హెయిర్ డ్రయ్యర్ల వాడకం వల్లే విద్యుత్ కొరత వచ్చిందా? అని వారు అధ్యక్షుడ్ని నిలదీస్తున్నారు.

  • Loading...

More Telugu News