: ఇమ్రాన్ హష్మీ చాలా ధైర్యం గల తండ్రి: అమితాబ్ బచ్చన్


ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ చాలా ధైర్యంగల తండ్రి అంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక కథేమిటంటే... ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆరేళ్ల అయాన్ కిడ్నీ కేన్సర్ వ్యాధితో పోరాడి బయటపడ్డాడు. 2014లో ఈ వ్యాధి బారినపడ్డ అయాన్ ను చికిత్స నిమిత్తం నాడు కెనడా తీసుకువెళ్లారు. అయితే, ఈ చికిత్స ఎంతో బాధాకరమైనదైనప్పటికీ అయాన్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొడుకు విషయంలో ఇమ్రాన్ హష్మీ చాలా ధైర్యంగా ఉన్నారని బిగ్ బీ ప్రశంసించారు. అంతేకాకుండా అయాన్ మనోధైర్యం సాటిలేనిదని కితాబిచ్చారు. కాగా, ఈ ట్వీట్ కు ఇమ్రాన్ హష్మీ సమాధానమిస్తూ, ‘యు ఆర్ ద ఒరిజినల్ సూపర్ హీరో !’ అంటూ బిగ్ బీని ప్రశంసించారు. తన కొడుకు బ్యాట్ మ్యాన్ కావాలని కోరుకుంటాడని, కానీ, బ్యాట్ మ్యాన్ అమితాబ్ లా కావాలని కోరుకుంటాడని హష్మీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News