: జనసేన పోటీ చేసే పక్షంలో మాతో కలిసిరావాలి: బొండా ఉమ
2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడాన్ని ఓ మిత్రపక్షంగా స్వాగతిస్తున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో భాగస్వామ్యంతోనే బరిలోకి దిగుతారని భావిస్తున్నామని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయబోరని అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఆయన తమకు మద్దతిచ్చారని, ప్రచారం కూడా చేశారని గుర్తు చేసిన బొండా ఉమ ఇకపై కూడా ఓ జట్టుగా ముందుకు వెళితేనే మంచిదని హితవు పలికారు.