: అనంత్ అంబానీ సంకల్పాన్ని గౌరవిస్తా: సల్మాన్ ఖాన్


గత రెండు రోజులుగా దేశం మొత్తం అనంత్ అంబానీపై చర్చతో ఊగిపోతోంది. ఐపీఎల్ మ్యాచుల్లో, అంబానీల సెలబ్రిటీ పార్టీల్లో మొన్నటి వరకు పెద్దసైజు టెడ్డీ బేర్ లా కనిపించే అనంత్ అంబానీ ఈమధ్య సన్నగా, నాజూగ్గా తయారయ్యాడు. దీంతో అంతా అతనిపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కూడా అనంత్ పై ప్రశంసలు కురిపించాడు. 18 నెలల్లో 108 కేజీల బరువు తగ్గిన అతని సంకల్పాన్ని గౌరవిస్తానని, ఒక దీక్షతో పట్టుదలతో బరువు తగ్గాడని అనంత్ అంబానీని అభినందించాడు. అనంత్ ఇలా తయారవడం పట్ల సంతోషంగా ఉందని సల్లూ భాయ్ తెలిపాడు. ఈ సందర్భంగా నాజూగ్గా మారిన అనంత్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News