: శ్రీనగర్ నిట్ లో పరీక్షలు వాయిదా... ఊళ్లకు వెళ్లేందుకు నాన్ లోకల్స్ కు అనుమతి
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుల తరబడి కొనసాగిన హైటెన్షన్ కారణంగా విద్యా సంస్థలో చదువుతున్న నాన్ లోకల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో తమ సొంతూళ్లకు వెళతామన్న విద్యార్థుల వినతికి అటు వర్సిటీ అధికారులు, ఇటు పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇరత ప్రాంతాల విద్యార్థులతో పాటు 120 మంది దాకా తెలుగు విద్యార్థులు అక్కడే చిక్కుబడిపోయారు. ఉద్రిక్తతల కారణంగా ఆ విద్యా సంస్థలో వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి లభించింది. దీంతో ఇప్పటికే తెలుగు విద్యార్థులతో పాటు అక్కడ చదువుతున్న ఇతర ప్రాంతాల విద్యార్థులు తమ ఊళ్లకు బయలుదేరారు.