: ఉక్రెయిన్ లో దారుణం... దుండగుల దాడిలో ఇద్దరు భారత మెడికోలు దుర్మరణం
ఉక్రెయిన్ లో దారుణం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ లో వైద్య విద్యనభ్యసించేందుకు వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులను అక్కడి దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. ఈ దాడిలో భారత్ కు చెందిన మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఉక్రెయిన్ లోని ఉజ్గరోద్ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులు ప్రణవ్ శాండిల్య, అంకుర్ సింగ్, ఇంద్రజిత్ చౌహాన్ లపై ముగ్గురు ఉక్రెయిన్ దేశస్తులు నిన్న కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శాండిల్య, సింగ్ చనిపోగా, తీవ్ర గాయాలైన చౌహాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చౌహాన్ ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉక్రెయిన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు ఈ దాడిని భారత విదేశాంగ శాఖ నేటి ఉదయం ధ్రువీకరించింది.