: పవన్ ఇంటర్వ్యూ చూశా... నా ఉద్దేశాన్ని సరిగ్గా తెలుసుకున్నాడు: రాంగోపాల్ వర్మ
టీవీ 9 న్యూస్ చానల్ లో వచ్చిన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను తాను చూశానని దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. తన ఉద్దేశాలను పవన్ సరిగ్గా అర్థం చేసుకున్నాడని వ్యాఖ్యానించిన వర్మ, అతనిపై తనకిప్పుడు మరింత ప్రేమ పెరిగిందని అన్నాడు. నిన్న టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మకు ఫ్రస్ట్రేషన్ అధికమని, అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోబోనని పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, "సర్దార్ గబ్బర్ సింగ్ ను, రాజా సర్దార్ గబ్బర్ సింగ్ నూ ఓ చిన్నారి చంపేశాడు" అని చెబుతూ, మోగ్లీ చిత్రాన్ని (జంగిల్ బుక్ హీరో) ఉంచాడు. ఆపై పవన్ కల్యాణ్ చిత్రం కన్నా, విదేశీ డబ్బింగ్ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని, పవర్ స్టార్ ను నిద్ర నుంచి లేపాల్సిన బాధ్యత ఆయన అభిమానులదేనని అన్నాడు.