: 4జీ స్మార్ట్ ఫోన్లు... 16 లక్షల మంది విద్యార్థులపై 'కరుణా'స్త్రం!


ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాడులో, ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి కన్ను 16 లక్షల మంది విద్యార్థులపై పడింది. పార్టీ మేనిఫెస్టోలో పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను, 3జి, 4జి ఉచిత సేవలను, ల్యాప్ టాప్, టాబ్లెట్ లను ఇస్తామని ఆయన వరాలు గుప్పించారు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని మెప్పించగలిగితే, వారి కుటుంబాల ఓట్లు తమకు పడతాయన్నది కరుణానిధి మనసులోని ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో మరిన్ని వాగ్దానాలను ఆయన గుప్పించారు. రైతు రుణాలు, విద్యా రుణాల మాఫీ, మద్య నిషేధం వంటి హామీలిచ్చారు. మద్య నిషేధం కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మూడోవంతు కోల్పోయినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక రుణాల మాఫీ కారణంగా ఒకసారి రూ. 11 వేల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తుందని వివరించాయి. వీటితో పాటు 'ఆవిన్' పాల ధరను లీటరుకు 7 రూపాయలకు తగ్గిస్తామని ఆయన ఇచ్చిన హామీ అందరినీ ఆకర్షిస్తోంది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ. 5 వేలు ఇస్తామని కూడా డీఎంకే హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News