: బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతే!... దుబాయిలో మరో ఆకాశహర్మ్యానికి ఎమ్మార్ ప్రణాళిక


ప్రపంచంలో ఎత్తైన భవంతి ఏదని ప్రశ్నిస్తే... బుర్జ్ ఖలీఫా అనే సమాధానం ఠక్కున వచ్చేస్తుంది. దుబాయి కేంద్రంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎమ్మార్... చెమటోడ్చి కట్టిన ఈ నిర్మాణం ఎత్తెంతో తెలుసా? 828 మీటర్లు అంటే...2,700 అడుగులు. ఇంతటి భారీ భవంతి ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. అయితే తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు ఎమ్మార్ రంగంలోకి దిగింది. మరో రెండున్నరేళ్లలో అంటే... 2020 నాటికి బుర్జ్ ఖలీఫాను తలదన్నే రీతిలో మరో భారీ భవంతిని నిర్మించనున్నట్లు ఎమ్మార్ చైర్మన్ మొహమద్ అలబ్బార్ చెప్పారు. నిన్న దుబాయిలో మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. దాదాపు ఓ మిలియన్ డాలర్ల ఖరీదుతో కట్టనున్న ఈ నిర్మాణం ఎత్తు ఎంత అన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆ విషయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News