: రాంగోపాల్ వర్మ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు... పట్టించుకోక్కర్లేదు!: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్య


ఎప్పుడూ తన వ్యాఖ్యలు, కామెంట్లతో వివాదాలు సృష్టిస్తుండే దర్శకుడు రాంగోపాల్ వర్మపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని అన్నారు. ఆయన కామెంట్లను విని నవ్వుకుంటానని తెలిపారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన 'ఫేస్ టు ఫేస్' ఇంటర్వ్యూలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వర్మ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన తాజా చిత్రంలో కులంపై చెప్పిన డైలాగులు కేవలం సినిమా కోసమేనని, అవి తన వ్యక్తిగత అభిప్రాయాలుగా తీసుకోవద్దని కోరారు. తాను జనసేన పార్టీని ప్రకటించిన సమయంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరపై లేదని, ఉంటే అప్పుడే తన వైఖరిని బయటపెట్టి ఉండేవాడినని అన్నారు. దేశానికి మంచి నాయకుడన్న ఒకే కారణంతో మోదీకి మద్దతు పలికానని, ఆ పార్టీలో చేరే ఉద్దేశాలు తనకు ఎన్నడూ లేవని తెలిపారు.

  • Loading...

More Telugu News