: టీఆర్ఎస్ కంచుకోటలో ఖాతా తెరిచిన కమలదళం!... రెండు వార్డుల్లో బీజేపీ విజయం


తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న సిద్దిపేట మునిసిపాలిటీలో కమల దళం భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది. నేటి ఉదయం ప్రారంభమైన మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు రెండు వార్డుల్లో విజయం సాధించారు. తొలి గంటలోనే మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించగా, తాజాగా వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇక బీజేపీ టికెట్ పై బరిలోకి దిగిన శ్రీకాంత్ 14వ వార్డులోను, వెంకట్ 17వ వార్డులోను విజయ బావుటా ఎగురవేశారు. 3,4,5 వార్డులతో పాటు 22, 25 వార్డుల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఓ స్థానంలో కాంగ్రెస్ గెలవగా, మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

  • Loading...

More Telugu News