: టీఆర్ఎస్ గెలుపు ఖాయం!... మెజారిటీ మాత్రమే తేలాలి!: కాసేపట్లో ‘సిద్దిపేట’ కౌంటింగ్
మెదక్ జిల్లా సిద్దిపేట మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుల సొంతూరైన సిద్దిపేటలో టీఆర్ఎస్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తం 28 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ దాదాపుగా ఏకపక్షంగానే సాగింది. మునిసిపాలిటీని ఏకగ్రీవం చేసుకోవాలన్న టీఆర్ఎస్ యత్నాలు చివరి నిమిషంలో బెడిసికొట్టడంతో ఎన్నికలు తప్పలేదు. అయితే ఒకటి, రెండు వార్డులు మినహా మెజారిటీ వార్డుల్లో టీఆర్ఎస్ కు ఓట్లు గంపగుత్తగా పడ్డాయని వార్తలొచ్చారు. మరికాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు రెండు గంటల్లోనే ముగియనుంది.