: సత్తా చాటిన కోల్ కతా...ఢిల్లీపై విజయం
ఐపీఎల్ ఆరంభం పేలవంగా ఉంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిరాశపరిస్తే...రెండో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అభిమానులను అలరించడంలో విఫలమయ్యారు. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 17.4 ఓవర్లలో కేవలం 98 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఉత్తమ ఆటగాళ్లున్నప్పటికీ వారంతా విఫలం కావడంతో జహీర్ సేన దారుణంగా అవుటైంది. 99 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం రాబిన్ ఊతప్ప (35) వికెట్ ను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ గంభీర్ (38), పాండే (15) 14.1 ఓవర్లలో మ్యాచ్ ను ముగించేశారు. దీంతో రెండో మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది.