: బన్నీ చెప్పుకున్నాడు...నేను చెప్పుకోలేకపోయాను: చిరంజీవి


సరైనోడు సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతుందని చిరంజీవి చెప్పారు. ఇందులో విలన్ గా నటించిన ఆది పినిశెట్టిని ప్రత్యేకించి అభినందించాలని చిరంజీవి తెలిపారు. తమిళంలో హీరోగా రాణిస్తున్న దశలో తెలుగులో విలన్ గా చేయడం పెద్ద సాహసం అని ఆయన చెప్పారు. 'మోసగాడు' సినిమాలో తాను విలన్ గా చేశానని, తన లాగే ఆది కూడా ఏమాత్రం భేషజాలు లేకుండా ఈ పాత్రను అంగీకరించడం చూస్తుంటే అతనికి ఎంతో బంగారు భవిష్యత్ ఉందని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సినిమాకు తమన్ మంచి సంగీతం అందించాడని ఆయన అన్నారు. ఈ పాటలు వింటుంటే...డాన్స్ చేయాలన్న కోరిక కలిగేలా సంగీతం అందించాడని తమన్ ను ఆయన ప్రశంసించారు. డాన్స్ చేయాలని ఉందని బన్నీ చెప్పుకున్నాడు...నేను చెప్పుకోలేకపోయానని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే, స్థలాలను కేటాయించాలని ఆయన సూచించారు. స్టూడియోలకు, ఇతర శాఖలకు భూములివ్వాలని ఆయన చెప్పారు. వైజాగ్ లో సినీ పరిశ్రమ నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News