: రెండు ముక్కల్లో 'సరైనోడు' కథ చెప్పిన బోయపాటి శ్రీను


న్యాయం నాలుగు కాళ్ల మీద నిలబడాలి, అన్యాయానికి కాళ్లు ఉండకూడదని భావించే కుర్రాడి కథే 'సరైనోడు' సినిమా కథ అని ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. సరైనోడు ఆడియో విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ, తాను 'ఈనాడు' పత్రికలో పని చేశానని. ఆ తరువాత రామోజీరావు చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నానని చెప్పారు. అలాగే గీతా ఆర్ట్స్ లో అసోసియేట్ గా పని చేశానని, ఇదే సంస్థలో దర్శకుడిగా పని చేశానని అన్నారు. శ్రీకాంత్ ఇందులో బాబాయ్ క్యారెక్టర్ చేశాడని, ఎక్కడికెళ్లినా మంచి జరగాలని ఆశించే శ్రీకాంత్ తో పని చేయడం గొప్పగా ఉందని బోయపాటి తెలిపారు. ఈ సినిమాలో రకుల్ ను చూశాక, 'ఈ అమ్మాయి మా ఇంట్లో మనిషి' అని అంతా ఫీలవుతారని ఆయన అన్నారు. అంజలితో పని చేసే అవకాశం దొరికిందని, ఆమె ఓ పాటలో నటించిందని చెప్పారు. ఆదికి 25 నిమిషాలు కథ చెబితే ఆయన అంగీకరించారని ఆయన తెలిపారు. తాను డైరెక్టర్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్ అని బోయపాటి తెలిపారు. కృషి, కసి కలిపితే బన్నీ అని ఆయన అన్నారు. అన్నయ్య సినిమాకు అసోసియేట్ గా పని చేశానని, చిరంజీవితో పని చేసిన తరువాతే తాను డైరెక్టర్ అయ్యానని బోయపాటి తెలిపారు.

  • Loading...

More Telugu News