: ప్రేమకథా చిత్రాలకు మ్యూజిక్ ఇవ్వడం సులభం: తమన్
ప్రేమకథా చిత్రాలకు మ్యూజిక్ ఇవ్వడం సులభమని సంగీత దర్శకుడు తమన్ తెలిపాడు. సరైనోడు ఆడియో విజయోత్సవ వేడుకలో తమన్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ లాంటి నటుడి సినిమాకు సంగీతం ఇవ్వడం అంత గొప్ప అవకాశం ఇంకోటి ఉండదని అన్నాడు. అల్లు అర్జున్ ను స్క్రీన్ మీద చూస్తే ఓ ఎనర్జీ వస్తుందని ఆయన చెప్పాడు. అలాంటి ఎనర్జీ కలిగిన అల్లు అర్జున్ తో పని చేయడం కల నిజమైనట్టు ఉందని అన్నాడు. గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ నిర్మించిన సినిమాలో పని చేయడం సంతోషంగా ఉందని తమన్ చెప్పాడు. కమర్షియల్ సినిమాకు సంగీతం అందించడం కత్తిమీద సాములాంటిదని తమన్ చెప్పాడు.