: కర్నూలు మాజీ ఎమ్మెల్యే కాటసానిపై కిడ్నాప్ కేసు
కర్నూలు జిల్లా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. కర్నూలుకు చెందిన వహీద్ బంధువులు మాజీ ఎమ్మెల్యేపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వహీద్ ను కిడ్నాప్ చేసి అతని ఆస్తిని సొంతం చేసుకునేందుకు కాటసాని ప్రయత్నిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.