: బన్నీ, రామ్ చరణ్ లను చూస్తే గర్వంగా ఉంది: శ్రీకాంత్
అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ లను చూస్తే చాలా గర్వంగా ఉంటుందని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ తెలిపాడు. 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో చిరంజీవిని, 'గోవిందుడు అందరివాడే'లో రామ్ చరణ్ ను, 'సరైనోడు'లో అల్లు అర్జున్ ను చాలా దగ్గర్నుంచి చూశానని ఆయన అన్నాడు. వారికి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు పడే కష్టం చూస్తే...మనం ఇంత కష్టపడలేదనిపిస్తుందని ఆయన చెప్పాడు. తన లాంటి వారికి చిరంజీవి ఆదర్శమైతే, తన కుమారుడి లాంటి వారికి బన్నీ, రామ్ చరణ్ ఆద్శరంగా నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డాడు. తన కుమారుడు ఇన్ స్టిట్యూట్ కు వెళ్తానంటే...ఇన్ స్టిట్యూట్ అవసరం లేదని, తనతో పాటు షూటింగ్ స్పాట్ కు వచ్చి అల్లు అర్జున్ ను గమనించమని చెప్పానని ఆయన తెలిపాడు. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ అవుతుందని శ్రీకాంత్ చెప్పాడు. ఈ సినిమాలో తనకు ఓ పాత్ర ఇచ్చిన బోయపాటికి ఆయన ధన్యవాదాలు చెప్పాడు.