: సంతోషాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చు: సర్వే తేల్చిన నిజం


డబ్బుతో దేన్నయినా కొనచ్చు కానీ, సంతోషాన్ని మాత్రం కొనలేమని పలు సినిమాల్లో మన సినిమా హీరోలు డైలాగులు చెబుతుంటారు. అయితే అది తప్పని పరిశోధన తేల్చింది. డబ్బుతో సంతోషం కొనుక్కోవచ్చని వెల్లడించింది. కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు ఓ బ్యాంకుతో కలిసి చేసిన ఓ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆ సర్వే కోసం 625 మంది ఖాతాదారులను కేంబ్రిడ్జ్ బీస్కూల్, యూనివర్సిటీ, బ్యాంకు ఎంచుకున్నాయి. వారు 6 నెలల పాటు జరిపిన 76 వేల లావాదేవీలను పరిశీలించగా డబ్బుతో సంతోషం కొనుక్కోవచ్చని వెల్లడైంది. ఈ 76 వేల లావాదేవీలను నిపుణులు 112 రకాలుగా వర్గీకరించారు. వాటిని 59 రకాలుగా వడపోసి, వాటిని విశ్లేషించారు. తమ వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులు కొనుగోలు చేసిన వారు సంతోషంగా ఉన్నట్టు వారు కనుగొన్నారు. ధనం, సంతోషం మధ్య సన్నని గీత ఉందని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించగా, అది తప్పని తాము కనుగొన్నామని కేంబ్రిడ్జ్ సంస్థ వెల్లడించింది. వ్యక్తిత్వానికి సరిపడా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఆనందంగా ఉన్నట్టు తాము గుర్తించామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News