: తమిళంలోకి కూడా వెళ్లడానికి మనం ఎందుకు భయపడాలి? పవన్ కల్యాణ్


తమిళ సినిమాలు తెలుగులో బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు, తమిళంలోకి వెళ్లేందుకు తెలుగు సినిమాలు ఎందుకు భయపడుతున్నాయని సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. తెలుగు రాష్ట్రాల్లో తమిళ డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందని అన్నాడు. ఇలాంటి వాతావరణమే తమిళనాడులో కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించాడు. బాలీవుడ్ లో కూడా తెలుగు రీమేక్ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయంటే తెలుగు సినిమాలకు ఆ సామర్థ్యం ఉందని అర్థమవుతుందని పవన్ పేర్కొన్నాడు. అది అర్థం చేసుకోకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ చేస్తాము అని పేర్కొనడం సరికాదని ఆయన తెలిపాడు. సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News