: బ్రిటన్ రాజ దంపతులతో క్రికెట్ ఆడిన సచిన్


ముంబైలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. బ్రిటన్ లో పుట్టిన క్రికెట్ ను పురాతన కాలంలో రాజులు, సంపన్నులు కాలక్షేపానికి ఆడేవారు. తదనంతర కాలంలో బ్రిటన్ రాజకుటుంబీకులు ఆడిన సందర్భాలు అరుదు. బ్రిటన్ యువరాజ్ ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు పదిరోజుల భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ముంబైలోని ఓ ఎన్జీవోను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో పలు అంశాలపై సంభాషించారు. అనంతరం వారితో కలిసి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొనడంతో రాజదంపతులతో క్రికెట్ ఆడారు. కేట్ మిడిల్ట్ కొట్టిన షాట్ కు సచిన్ పిల్లాడిలా కేరింతలతో ఉత్సాహం నింపారు. సచిన్ తో పాటు దిలీప్ వెంగ్ సర్కార్ కూడా ఈ సందర్భంగా పిల్లలతో క్రికెట్ ఆడారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ ప్రొఫెషనల్ లా బ్యాటు ఝుళిపించడం విశేషం.

  • Loading...

More Telugu News