: మ్యాచ్ లు తరలించడం కంటే నీటి సమస్యను పరిష్కరించండి!: ధోనీ సూచన


మహారాష్ట్రలో నీటి ఎద్దడి కారణంగా మ్యాచ్ లను వేరే ప్రాంతానికి తరలించాలన్న ఆలోచన సరైనది కాదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ముంబైలో ధోనీ మాట్లాడుతూ, మహారాష్ట్ర నుంచి మ్యాచ్ లను తరలించడం వల్ల నీటి సమస్యకు పరిష్కారం లభించదని అన్నాడు. ఈ నీటిఎద్దడిని పారద్రోలేందుకు సరైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని, తీవ్రతను గుర్తించి సరైన పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించాడు. నీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఉందని, ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ధోనీ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News