: నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు...టెక్నీషియన్ అవుదామనుకున్నా: పవన్ కల్యాణ్


తానెప్పుడూ యాక్టర్ అవ్వాలని భావించలేదని పవన్ కల్యాణ్ తెలిపాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాల్లో టెక్నీషియన్ అవుదామని అనుకున్నానని చెప్పాడు. అందుకోసం యూఎస్ కూడా వెళ్దామని భావించానని పవన్ అన్నాడు. దీంతో అప్పట్లోనే తన మదిలో బోల్డు కధలు మెదిలేవని పవన్ చెప్పాడు. అప్పట్లో సరిహద్దులు కథాంశాలుగా తీసుకుంటే బాగా ఆడుతాయని అనిపించేదని, అందుకే అలాంటి కథలు ఊహల్లో మెదిలేవని పవన్ చెప్పాడు. సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికొస్తే, తానేదో గొప్ప కథ చెప్పాలని భావించలేదని, ప్లెయిన్ కథను ప్రేక్షకులకు సింపుల్ గా సోది లేకుండా చెప్పాలని భావించానని పవన్ తెలిపాడు. ఈ సినిమాను రాజకీయాలకు నిచ్చెనగా వాడుకోలేదని ఆయన స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News