: ముంబై దాడుల మృతులకు ప్రిన్స్ విలియమ్, కేట్ దంపతుల నివాళి
26/11 ముంబైదాడుల మృతులకు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ దంపతులు నివాళులర్పించారు. పదిరోజుల భారత పర్యటనకు బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ దంపతులు ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తాజ్ హోటల్ లో వారు బస చేయనున్నారు. ఈ సందర్భంగా తాజ్ హోటల్ సిబ్బందితో మాట్లాడి ఆనాటి దుర్ఘటన అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం ఓ ఎన్జీవోను సందర్శించారు. అక్కడి పిల్లలతో మాట్లాడారు. అక్కడే సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులను కలుసుకున్నారు.