: పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం


ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ఈ రోజు అగ్ని ప్రమాదం సంభవించింది. పార్లమెంటులోని అనెక్స్ బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. దీంతో పార్లమెంటు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నాలుగు ఫైరింజన్లతో రంగ ప్రవేశం చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News