: పోలవరం నిర్మాణానికి రాష్ట్రం చొరవ చూపాలి: పురంధేశ్వరి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని బీజేపీ నేత పురంధేశ్వరి సూచించారు. ప్రకాశం జిల్లాలో ఆమె మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు లేవని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేంద్రం సూచించిన వాటికే ఖర్చు చేయాలని ఆమె సూచించారు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయని ఆమె చెప్పారు. వరదనీటిని ఒడిసిపట్టే పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమని ఆమె పేర్కొన్నారు. అలాంటి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదని ఆమె సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అయితే కేంద్రానికి రాష్ట్రం సహాయం చేయాలని ఆమె చెప్పారు. రాష్ట్ర సహకారం లేకుండా పోలవరం పూర్తి కాదని ఆమె తెలిపారు.