: ఆ బాణసంచా కూడా పేలివుంటే 1000 మంది మరణించేవారేమో!


ఈ తెల్లవారుఝామున కేరళలోని పుట్టంగల్ దేవి ఆలయంలో జరిగిన ఘోర ప్రమాదం తరువాత, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసు అధికారులు అవాక్కయ్యారు. బాణసంచా పేలుళ్ల కారణంగా అంత పెద్ద ప్రమాదం జరుగగా, పేలని బాణసంచాను చూసిన పోలీసులు వాటికి కూడా నిప్పంటుకుని వుంటే, ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల్లో పోటాపోటీగా బాణసంచాను కాలుస్తారని తెలుస్తోంది. దాదాపు 15 వేల మంది ఈ వేడుకలను తిలకించేందుకు గుడి సమీపానికి చేరుకున్న వేళ, నిప్పురవ్వలు బాణసంచాపై పడి భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మిగిలి వున్న బాణసంచా కూడా పేలి వుంటే, 1000 మంది వరకూ మరణించేవారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహా విషాదం వెనుక ఆలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఈ మేరకు బోర్డు అధికారులపై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News