: 100 దాటిన మృతులు... తనకు ప్రొటోకాల్ అవసరం లేదన్న ప్రధాని
కేరళలోని కొల్లాంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో కలత చెందిన ప్రధాని హుటాహుటిన బయలుదేరి కేరళ చేరుకున్నారు. తనకు భద్రత, ప్రొటోకాల్ పేరిట అధికారులు ఎవరూ హడావుడి పడవద్దని ఆయన సూచించారు. ఎయిర్ ఫోర్స్, వాయుసేన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. తాను బాధితులకు అండగా ఉంటామన్న భరోసాను ఇచ్చేందుకు మాత్రమే కేరళకు వస్తున్నానని, ఎలాంటి స్వాగతాలు ఏర్పాటు చేయవద్దని కోరారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 100ను దాటింది. ఇప్పటివరకూ 102 మంది మరణించినట్టు కేరళ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.