: బీ-52 బాంబర్లను రంగంలోకి దించిన అమెరికా
సిరియా, ఇరాక్ దేశాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా అత్యాధునిక బీ-52 బాంబర్ విమానాలను అమెరికా రంగంలోకి దించింది. 2006లో ఆప్ఘనిస్తాన్ పై యుద్ధం తరువాత బీ-52లను అమెరికా బయటకు తీయడం ఇదే తొలిసారి. ఈ యుద్ధ విమానాలు ఖతార్ తరలివచ్చాయి. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తూ, ఉగ్రవాదుల స్థావరాలపై దాడులకు వెళ్లే సైన్యానికి సహకరించనున్నాయని యూఎస్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ చార్లెస్ బ్రౌన్ పేర్కొన్నారు. వీటి వాడకంతో ఐఎస్ఐఎస్ పై మరింత ఒత్తిడి పెట్టవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఎన్ని యుద్ధ విమానాలను వాడనున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన తెలియజేయలేదు.