: నంబర్ వన్ దగాకోరు అచ్చెన్నాయుడు: ధర్మాన నిప్పులు


చంద్రబాబు మంత్రివర్గంలో నంబర్ వన్ దగాకోరుగా ఉన్న అచ్చెన్నాయుడికి అత్యుత్తమ మంత్రిగా ఎలా మార్కులు ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీది దొంగల పాలనని, ఉపాధి హామీ నిధుల్లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడేటప్పుడు ఆయన మైక్ కట్ చేసి అచ్చెన్నాయుడిని ఉసిగొల్పుతున్నారని, అచ్చెన్నాయుడు వ్యక్తిగత విమర్శలతో కూడిన పిచ్చి వాగుడుతో సమస్యను పక్కదారి ప్టిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలవబోమన్న భయంతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అన్నారు. అమాయకులైన రైతులకు మోసపు మాటలు చెప్పి బాబు అధికారంలోకి వచ్చారని, రైతులు, నిరుద్యోగులు, మహిళలు చంద్రబాబుకు ఓటెందుకు వేశామా అని కుమిలిపోతున్నారని తెలిపారు. వైకాపా నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలంతా దమ్ము, ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి తిరిగి గెలిచి రావాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News