: భద్రాచలం శ్రీరామ కల్యాణ ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు!
భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తప్పులు చోటు చేసుకున్నాయి. పట్టాభిషేకం ఈ నెల 16న జరుగనుండగా, మార్చి 29న జరుగుతుందని పేర్కొనడంపై ఈఓ జ్యోతి తీవ్రంగా పరిగణిస్తున్నారు. పత్రిక తయారు చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేలాదిగా ముద్రితమైన పత్రికల పంపిణీ కూడా దాదాపు పూర్తయింది. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి మీడియా వరకూ పత్రికలు అందాయి. పట్టాభిషేకం తేదీ తప్పుగా వచ్చిందని మీడియా వెల్లడించే వరకూ అధికారులు జరిగిన తప్పును గుర్తించక పోవడం గమనార్హం.