: 86కు పెరిగిన మృతులు... పొద్దున్నే మనసును కలిచివేసిన దుర్వార్తన్న ప్రధాని


ఈ తెల్లవారుఝామున కేరళలోని కొల్లాం సమీపంలోని పుట్టింగల్ దేవాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 86కు పెరిగింది. వివిధ ఆసుపత్రులలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో, మృతుల సంఖ్య 100ను దాటుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "కొల్లాంలో దేవాలయ ప్రమాదం మాటలకందని షాకింగ్. ఈ వార్త నా హృదయాన్ని కలచివేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని అన్నారు. వెంటనే కొల్లాం వెళ్లాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆదేశించిన ప్రధాని, తాను కూడా అక్కడికి వెళ్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News