: లొంగిపోయిన 122 మంది మావోయిస్టులు
చత్తీస్ గఢ్ లో 122 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి, ఇతర సీనియర్ అధికారుల ఎదుట వీరంతా ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగుబాటుకు సుక్మా జిల్లాలోని డోర్నపాల్ పోలీసు స్టేషన్ వేదికైంది. నక్సలైట్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతం నుంచి భారీగా లొంగుబాట్లు జరగడంతో పోలీసు వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీరిలో చాలా మంది తలలపై రివార్డులు ఉన్నాయని, గతంలో పలు హింస, విధ్వంసం ఘటనలతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించిన పోలీసులు, నిబంధనల ప్రకారం అందరికీ పునరావాస సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొన్నారు.