: ఆడనివ్వకుంటే రూ. 100 కోట్లు పోతాయ్: ఫడ్నవీస్ తో అనురాగ్ ఠాకూర్


మహారాష్ట్రలో ఐపీఎల్ క్రికెట్ పోటీలను ఆడనివ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయం పోతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. నీటి పేరిట పోటీలను అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఆయన హితవు పలికారు. గత సంవత్సరపు ఐపీఎల్ పోటీల తరువాత బీసీసీఐ నిర్వహించిన అధ్యయనంలో మహారాష్ట్రకు రూ. 100 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ యేడాది అంతకు మించిన ఆదాయం రావచ్చని ఆయన అన్నారు. మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ వెళ్లిపోయినా తమకేమీ ఇబ్బంది లేదని ఇటీవల ఫడ్నవీస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ముంబై సహా, పుణె, నాగపూర్ నగరాల్లో 18 మ్యాచ్ లు జరుగనుండగా, పిచ్ లను సిద్ధం చేసేందుకు లక్షల లీటర్ల నీరు అవసరపడనుంది. అసలే తీవ్ర నీటి కొరత ఉన్న రాష్ట్రంలో ఆటల పేరిట నీళ్లను వృథా చేయకూడదని మహా సర్కారు నిర్ణయించగా, ఫ్రాంచైజీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News