: ఈసీ పరిశీలనలో మోదీ, మమత ప్రసంగాలు
ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగాలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. "వారి ర్యాలీల్లో ప్రసంగాల సీడీలను ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి పంపించాము. వాటిని పరిశీలించిన తరువాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం" అని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. రెండు రోజుల క్రితం తన ప్రసంగంలో తృణమూల్ పార్టీపై విరుచుకుపడ్డ మోదీ, ఆ పార్టీని ఉగ్రవాద, హత్యా, అవినీతి పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ ను గద్దె దించాలని ప్రజలకు సూచించేందుకే, దేవుడు ఫ్లైఓవర్ ప్రమాదాన్ని సృష్టించాడని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు టీఎంసీ ఫిర్యాదు చేసింది.