: మిగిలింది మాంసం ముద్దలే... అగ్నిప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య


కేరళలోని కొల్లాం పట్టణం. పుట్టింగల్ దేవి ఆలయం... తెల్లవారుఝామున 3 గంటలు. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్న వేళ, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అంతా కోలాహలంగా ఉన్న సమయంలో భక్తులు బాణాసంచా కాలుస్తుండగా, నిప్పురవ్వలు, నేలపై ఉంచిన బాణాసంచాపై పడ్డాయి. ఒక్కసారిగా మంటలు పైకెగిశాయి. భక్తులకు ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి. క్యూలైన్లపై వేసిన పైకప్పులు అంటుకోవడం, బయటకు వెళ్లే దారులు తొక్కిసలాటలో మూసుకుపోవడంతో సుమారు 70 మంది సజీవదహనమయ్యారు. తెల్లవారుఝామున 3:30 గంటల సమయంలో వచ్చిన అగ్నిమాపక దళాలు, ఉదయం 7 గంటల వరకూ కూడా మంటలను పూర్తిగా అదుపు చేయలేకపోయాయి. ఈ ప్రమాదంలో 170 మంది గాయపడగా, అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలి మాంసపు ముద్దలతో అత్యంత భయానకంగా ఉందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

  • Loading...

More Telugu News