: నేనొస్తే హరీశ్ రావు ఖేల్ ఖతమ్: జగ్గారెడ్డి
గత కొంతకాలంగా తాను టీఆర్ఎస్ పార్టీలో చేరతానని వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరితే హరీశ్ రావు ఆటలు ఆగిపోతాయని, ఆయన పని ఖతమవుతుందని అన్నారు. ఆ పార్టీలో చేరితే చౌకీదారుగా మారిపోయినట్టేనని, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారమంతా కావాలని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరడం అతిపెద్ద తప్పని, ఇకపై ఎన్నడూ కాంగ్రెస్ ను వీడనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మునుగుతున్న పడవలాంటిదని, 2019 ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దేనని అంచనా వేశారు. పదిమంది హరీశ్ రావులు ఎదురైనా సంగారెడ్డిలో తానే విజయం సాధిస్తానని చెప్పారు.