: కేరళలో ఘోరం... దేవాలయంలో 63 మంది సజీవదహనం


కేరళలో ఘోరం జరిగింది. కొల్లంలోని ఓ దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్న వేళ, ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 63 మందికి పైగా సజీవదహనం కాగా, వందల మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ కారణంతో మంటలు అంటుకున్నాయన్న విషయం తెలియరాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు, పదుల సంఖ్యలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదయ్యాయి. ఈ దుర్ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News