: చంద్రబాబు స్ఫూర్తిగా కరుణానిధి అడుగులు!


ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడికి అధికారాన్ని అందించిన హామీల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రైతుల రుణమాఫీయే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తమిళనాట ఎన్నికలు జరుగనున్న వేళ, డీఎంకే అధినేత కరుణానిధి సైతం ఇదే దారిలో నడిచి, రుణమాఫీ బాట పట్టనున్నారు. నేడు ఆయన విడుదల చేయనున్న మేనిఫెస్టోలో రైతుల పంట రుణాలను, తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు దశలవారీగా మద్య నిషేధం తీసుకువస్తామని కూడా డీఎంకే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జయలలిత సైతం ప్రజలను ఆకర్షించేలా కొత్త హామీలను గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News