: నిరాడంబర మమతా బెనర్జీకి కారు కూడా లేదు: ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వెల్లడి
రాజకీయనాయకుల్లో నిరాడంబర నేతగా పేరొందిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. అఫిడవిట్లో ఇచ్చిన వివరాల ప్రకారం కారు సహా సొంత ఆస్తులేవీ లేవని ఆమె పేర్కొన్నారు. 2.15 లక్షల విలువ చేసే సొంత జిమ్ ఉందని ఆమె పేర్కొన్నారు. 2014-15లో తనకు 5.92 లక్షల ఆదాయం వచ్చినట్టు ఆమె తెలిపారు. తన మొత్తం చరాస్తుల విలువ 30.15 లక్షలని ఆమె తెలిపారు. 9.75 గ్రాముల జ్యువెలరీతో పాటు 18,436 రూపాయల నగదు తన వద్ద ఉన్నట్టు ఆమె వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ బబానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.